మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Hari Nama Mala Stotram – శ్రీ హరి నామమాలా స్తోత్రం


గోవిందం గోకులానందం గోపాలం గోపివల్లభమ్ |
గోవర్ధనోద్ధరం ధీరం తం వందే గోమతీప్రియమ్ || 1 ||

నారాయణం నిరాకారం నరవీరం నరోత్తమమ్ |
నృసింహం నాగనాథం చ తం వందే నరకాంతకమ్ || 2 ||

పీతాంబరం పద్మనాభం పద్మాక్షం పురుషోత్తమమ్ |
పవిత్రం పరమానందం తం వందే పరమేశ్వరమ్ || 3 ||

రాఘవం రామచంద్రం చ రావణారిం రమాపతిమ్ |
రాజీవలోచనం రామం తం వందే రఘునందనమ్ || 4 ||

వామనం విశ్వరూపం చ వాసుదేవం చ విఠ్ఠలమ్ |
విశ్వేశ్వరం విభుం వ్యాసం తం వందే వేదవల్లభమ్ || 5 ||

దామోదరం దివ్యసింహం దయాళుం దీననాయకమ్ |
దైత్యారిం దేవదేవేశం తం వందే దేవకీసుతమ్ || 6 ||

మురారిం మాధవం మత్స్యం ముకుందం ముష్టిమర్దనమ్ |
ముంజకేశం మహాబాహుం తం వందే మధుసూదనమ్ || 7 ||

కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియమ్ |
కౌమోదకీధరం కృష్ణం తం వందే కౌరవాంతకమ్ || 8 ||

భూధరం భువనానందం భూతేశం భూతనాయకమ్ |
భావనైకం భుజంగేశం తం వందే భవనాశనమ్ || 9 ||

జనార్దనం జగన్నాథం జగజ్జాడ్యవినాశకమ్ |
జామదగ్న్యం పరం జ్యోతిస్తం వందే జలశాయినమ్ || 10 ||

చతుర్భుజం చిదానందం మల్లచాణూరమర్దనమ్ |
చరాచరగురుం దేవం తం వందే చక్రపాణినమ్ || 11 ||

శ్రియఃకరం శ్రియోనాథం శ్రీధరం శ్రీవరప్రదమ్ |
శ్రీవత్సలధరం సౌమ్యం తం వందే శ్రీసురేశ్వరమ్ || 12 ||

యోగీశ్వరం యజ్ఞపతిం యశోదానందదాయకమ్ |
యమునాజలకల్లోలం తం వందే యదునాయకమ్ || 13 ||

సాలగ్రామశిలాశుద్ధం శంఖచక్రోపశోభితమ్ |
సురాసురైః సదా సేవ్యం తం వందే సాధువల్లభమ్ || 14 ||

త్రివిక్రమం తపోమూర్తిం త్రివిధాఘౌఘనాశనమ్ |
త్రిస్థలం తీర్థరాజేంద్రం తం వందే తులసీప్రియమ్ || 15 ||

అనంతమాదిపురుషమచ్యుతం చ వరప్రదమ్ |
ఆనందం చ సదానందం తం వందే చాఘనాశనమ్ || 16 ||

లీలయా ధృతభూభారం లోకసత్త్వైకవందితమ్ |
లోకేశ్వరం చ శ్రీకాంతం తం వందే లక్ష్మణప్రియమ్ || 17 ||

హరిం చ హరిణాక్షం చ హరినాథం హరప్రియమ్ |
హలాయుధసహాయం చ తం వందే హనుమత్ప్రియమ్ || 18 ||

హరినామకృతా మాలా పవిత్రా పాపనాశినీ |
బలిరాజేంద్రేణ చోక్తా కంఠే ధార్యా ప్రయత్నతః ||

ఇతి బలిరాజేంద్రేణోక్తం శ్రీ హరి నామమాలా స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.